
డ్రైవర్, క్లీనర్ అరెస్టు
చిన్నశంకరంపేట(మెదక్): కారును ఢీకొట్టి వ్యక్తిపై నుంచి లారీని దూసుకెళ్లిన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు రామాయంపేట సీఐ వెంకట్‌రాజాగౌడ్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం నార్సింగి మండలం వల్లూర్ శివారులో ఓ కారు ఢీకొట్టి అదే కారులో ఉన్న సత్తిరెడ్డి అనే వ్యక్తి లారీని నిలిపేందుకు ప్రయత్నించగా.. అతడిపై నుంచి లారీ తీసుకెళ్లడంతో సత్తిరెడ్డి మృతిచెందాడు. తూప్రాన్ శివారులో లారీ వదిలిపోయిన నిందితుడు గురువారం లారీ తీసుకెళ్లేందుకు రాగా రాజస్తాన్‌కు చెందిన డ్రైవర్ మోయిన్, క్లీనర్ హసీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.