
అధికారుల సంతకాలు లేకుండా చెల్లింపులు
రూ.22 వేల రికవరీ, 63 వేల జరిమానా
నంగునూరు(సిద్దిపేట): ఉపాధిహామీ పనుల మస్టర్‌పై ఎంపీడీఓ, ఏపీఓ సంతకాలు లేకుండానే చెల్లింపులు జరిగాయి. తనిఖీలో అవినీతి జరిగినట్లు గుర్తించి అధికారులు రికవరీ చేసి , జరిమానా విధించారు. నంగునూరులో సోమవారం 16వ జాతీయ ఉపాధిహామీ పనులపై ప్రజాదర్బార్ నిర్వహించారు. మార్చి నుంచి జూన్ వరకు మండలంలో జరిగిన పనులపై గ్రామాల్లో నిర్వహించిన సామాజిక తనిఖీ వివరాలు వెల్లడించారు. గ్రామసభలకు కొందరు టీఏలు, అసిస్టెంట్లు రాలేదని, పనులు ఒకరు చేస్తే డబ్బులు మరొకరికి చెల్లించారని, మస్టర్లలో చాలా తప్పులున్నాయని ఆడిట్ బృందం సభ్యులు సభ దృష్టికి తాసుకొచ్చారు. పనుల్లో అవకతవకలు జరిగినట్లు తేలడంతో ఎఫ్‌ఏల నుంచి రూ.22వేల రికవరీ, 63 వేల జరిమానా విధించినుట్లు డీఆర్‌డీఓ అసిస్టెంట్ పీడీ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ మెనేజర్ గణేశ్, క్వాలిటీ కంట్రోల్ అధికారి సంతోష్‌రెడ్డి, ఎస్‌ఆర్‌పీ భగవత్‌రావు, ఎంపీడీఓ లక్ష్మణప్ప పాల్గొన్నారు.