27 జెడ్పీటీసీలు, 276 ఎంపీటీసీలు | - | Sakshi
Sakshi News home page

27 జెడ్పీటీసీలు, 276 ఎంపీటీసీలు

Jul 14 2025 5:03 AM | Updated on Jul 14 2025 5:03 AM

 27 జెడ్పీటీసీలు, 276 ఎంపీటీసీలు

27 జెడ్పీటీసీలు, 276 ఎంపీటీసీలు

అమీన్‌పూర్‌ డీ నోటిఫై అయితే 271 ఎంపీటీసీలు, 26 జెడ్పీటీలుగా నిర్ధారణ

నారాయణఖేడ్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన మండల పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) పునర్విభజన తుదిజాబితా ప్రకారం జిల్లాలో 276 ఎంపీటీసీ స్థానాలను అధికారులు ఖరారు చేశారు. 27 జెడ్పీటీసీ స్థానాలు, అదేస్థాయిలో ఎంపీపీలు ఉండనున్నారు. కాగా అమీన్‌పూర్‌ మున్సిపాలిటీగా ఏర్పాటు కాగా, ప్రభుత్వం డీ నోటిఫై చేయాల్సి ఉంది. డీ నోటిఫై చేయకపోవడంతో జిల్లాలో ప్రస్తుతం 276 ఎంపీటీసీలు, 27 జెడ్పీటీసీ స్థానాలుగా అధికారులు ఖరారు చేశారు. త్వరలో ప్రభుత్వం అమీన్‌పూర్‌ను డీ నోటిఫై చేస్తే ఐదు ఎంపీటీసీ స్థానాలు తగ్గి జిల్లాలో 271 ఎంపీటీసీ స్థానాలు, 26 జెడ్పీటీసీ అదేస్థాయిలో ఎంపీపీల సంఖ్య ఖరారు కానుంది. అధికారులు ఇప్పటికే (మార్చి)లో ఎంపీటీసీ స్థానాలపై కసరత్తు పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించారు. కొత్తగా కొన్ని మున్సిపాలిటీలు అవతరించడంతో వాటిని మినహాయించి ప్రస్తుతం ఉన్న గ్రామాలతో కలిపి ఎంపీటీసీ స్థానాల సరిహద్దులను ఖరారు చేశారు. ఈమేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ సృజన విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఎంపీటీసీ స్థానాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను అధికారులు నిర్వహించారు. ఈనెల 8న ముసాయిదా ప్రకటన రాగా 8, 9వ తేదీల్లో అభ్యంతరాలను స్వీకరించారు. 10, 11 తేదీల్లో అభ్యంతరాల పరిశీలన చేపట్టారు. 12న శనివారం తుది జాబితాను వెల్లడించారు. ఎంపీటీసీ స్థానాల స్పష్టత అనంతరం ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతుంది.

నిజాంపేట్‌, చౌట్‌కూర్‌లలో ఆరు చొప్పున..

నూతనంగా నిజాంపేట్‌, చౌట్‌కూర్‌ మండలాలుగా ఏర్పాటు కాగా, ఈ మండలాల్లో ఎంపీటీసీలను ఖరారు చేశారు. నిజాంపేట్‌లో 6, చౌట్‌కూర్‌లో 6 చొప్పున నిర్ధారించారు. నిజాంపేట్‌ మండల పరిధిలో ర్యాలమడుగు, నిజాంపేట్‌– 1, నిజాంపేట్‌– 2 ఎంపీటీసీలను పాత ఖేడ్‌ మండలంలో నుంచి తీసుకోగా, నాగ్‌ధర్‌, బాచేపల్లి, రాంరెడ్డిపేట్‌లు కల్హేర్‌ మండలంలోని తీసుకొని నిజాంపేట్‌ మండలంలో నిర్ధారించారు. పుల్కల్‌ మండలం నుంచి వేరుపడ్డ చౌట్‌కూర్‌ మండలంలోనూ ఆరు ఎంపీటీసీ స్థానాలు ఖరారయ్యాయి. చౌట్‌కూర్‌, కోర్పొల్‌, సుల్తాన్‌పూర్‌, శివ్వంపేట్‌, చక్రియాల్‌, వెంకట కిష్టాపూర్‌ ఎంపీటీసీలుగా ఏర్పాటు చేశారు. పుల్కల్‌ మండలంలో మొత్తం 15 ఎంపీటీసీలు ఉండగా, ఇందులోంచి విభజించి చౌట్‌కూర్‌ మండలంలో 6 ఎంపీటీసీలు కేటాయించారు. ఈ అన్ని ఎంపీటీసీ స్థానాలన్నీ పుల్కల్‌ మండలం నుంచే ఏర్పాటయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement