
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
పరిగి ఎమ్మెల్యే, జిల్లా సంస్థాగతఎన్నికల ఇన్‌చార్జి రాంమోహన్‌రెడ్డి
నారాయణఖేడ్: అతిత్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు సమన్వయంతో కృషి చేయాలని పరిగి ఎమ్మెల్యే, పార్టీ సంస్థాగత ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి రాంమోహన్‌రెడ్డి సూచించారు. ఖేడ్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజాపాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతోందన్నారు. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతోందని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ద్వారా లబ్ధిపొందుతున్న విషయాలను సమగ్రంగా వివరించారు. జనాభా దమాషా ప్రకారం బీసీలకు సమానా వాటా దక్కాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం జరుగుతోందన్నారు. టీపీసీసీ సభ్యు లు శంకరయ్యస్వామి, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనంద్ స్వరూప్ షెట్కార్, వినోద్‌పాటిల్, మాజీ ఎంపీపీ, జెడ్పీసీటీలు, ఆయా మండలాల పార్టీల అధ్యక్షులు నియోజకవర్గంలోని కాంగ్రెస్‌పార్టీ, అనుబంధ సంఘాల బాధ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.