
ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి
కంది (సంగారెడ్డి): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింలు పిలుపునిచ్చారు. ఈనెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సన్నాహక సమావేశం మంగళవారం కందిలో నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ కార్పొరేట్లకు ప్రభుత్వాలు లాభం చేకూర్చుతున్నాయని ఆరోపించారు. రైతులు సాగు చేసిన పంటలకు కనీస మద్దతు ధర కల్పించడం లేదని మండిపడ్డారు. 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు ,కర్షకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సుజాత,నర్సింలు,ఆనంద్,షబానా,కాశమ్మ, మంజుల,సునంద,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.