యుద్ధ ట్యాంకులను పరిశీలించిన కేంద్రమంత్రి
కంది(సంగారెడ్డి): మండల పరిధిలోని ఎద్దు మైలారం ఆయుధ కర్మాగారం (ఓడీఎఫ్)లో యుద్ధ ట్యాంకులను రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతు పరిశీలించారు. గురువారం సాయంత్రం ఓడీఎఫ్‌ను కేంద్రమంత్రి సందర్శించారు. అనంతరం అక్కడి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓడీఎఫ్‌లో తయారవుతున్న బీఎంపీ 2 యుద్ధ ట్యాంకుల పనితీరును, అక్కడ తయారయ్యే యుద్ధ సామగ్రి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సైన్యానికి అవసరమైతే యుద్ధ ట్యాంకులను అందజేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. బీఎంపీ 2 ట్యాంకును అధికారులతో కలిసి నడిపారు. కార్యక్రమంలో ఎంపీ రఘునందన్‌రావు సీఎండీ సంజయ్ ద్వివేది, డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎస్.ముఖర్జీ, సీజీఎం శివశంకర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


