మొక్కలు పెంచుతూఆహ్లాదాన్ని పంచుతూ
● ప్లాస్టిక్ రహిత గ్రామాల కోసం కృషి చేస్తున్న ప్రకృతి ప్రేమికులు ● వినూత్నంగా ప్రచారం చేస్తూపర్యావరణానికి మేలు ● ప్లాస్టిక్ వాడితే కలిగే అనర్థాలపైవిస్తృత అవగాహన
నేడు ప్రపంచ పర్యావరణ దినం
ఆ హెచ్‌ఎం పర్యావరణ ప్రేమికుడు
నేడు అవార్డు అందుకోనున్న రామకృష్ణ
సదాశివపేట రూరల్(సంగారెడ్డి): పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాడు మండలంలోని నిజాంపూర్(కే) ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కావడంతో విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ఇంటరాక్టివ్, ప్రాజెక్ట్ , ప్రయోగాత్మక పద్ధతుల్లో వినూత్నంగా బోధిస్తున్నాడు. అలాగే స్టాప్ సింగిల్ యూస్ ప్లాస్టిక్, ప్రమోటింగ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ రిసోర్సెస్, వాటర్ కన్సర్వేషన్, కంట్రోలింగ్ ఎయిర్ పొల్యూషన్, వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పిస్తున్నారు. దీంతో ఆయన సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి పర్యావరణ అవార్డుకు ఎంపిక చేసింది. నేడు హైదరాబాద్‌లో పీసీబీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో అవార్డును అందుకోనున్నారు.


