నేడు ఖేడ్, సంగారెడ్డిలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా
నారాయణఖేడ్: జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల కోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళాలను శనివారం ఉదయం 10 గంటలకు నారాయణఖేడ్‌లో, సంగారెడ్డి కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జిల్లా ఫుడ్ కంట్రోలర్ సహాయ అధికారిణి అమృత తెలిపారు. ఆహార వ్యాపార నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 99089 78790, 99856 00602 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఝరాసంగం(జహీరాబాద్): శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో అమావాస్య సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. శుక్రవారం అమావాస్యను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమృత గుండంలో పవిత్ర పుణ్య స్నానాలు ఆచరించి గుండంలోని జల లింగానికి పూజలు చేశారు. అనంతరం క్యూ లైన్‌ల ద్వారా గర్భగుడిలోని పార్వతీ పరమేశ్వర్‌ను దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు.
డీఈ కార్యాలయంలో పాము కలకలం
జోగిపేట(అందోల్): జోగిపేట ట్రాన్స్‌కో డీఈ కార్యాలయంలో శుక్రవారం పాము కలకలం సృష్టించింది. ఉదయం వాచ్‌మేన్ కార్యాలయాన్ని శుభ్రం చేసి గదిలో తాగు నీరు పెడుతుండగా బుస్సు మంటూ శబ్ధం వచ్చింది. అటువైపు చూడగా పెద్ద పాము కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. పామును కొట్టడానికి సిబ్బంది సాహసించలేక అందోలుకు చెందిన పాములు పట్టే సంజీవులును పిలిపించారు. ఆయన గదిలోకి వెళ్లి కంప్యూటర్ సీపీయూలో ఉన్న పామును బయటకు తీసుకొచ్చాడు. దీంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం (సీఎంఓఎస్‌ఎస్) కింద అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నాగరాజమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీజీ, డాక్టోరల్ కోర్సు విద్యను అభ్యసిస్తున్న మైనార్టీ విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆసక్తి కల్గిన అభ్యర్థులు జనవరి 19 సాయంత్రం 5గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ప్రజల ఆదరణ
మరువలేనిది
ఉమ్మడి జిల్లా డీసీసీబీ డైరెక్టర్ అంజిరెడ్డి
ములుగు(గజ్వేల్): బీఆర్‌ఎస్ పార్టీపై ప్రజల ఆదరణ మరువలేనిదని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, ములుగు పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి అన్నారు. నూతన సర్పంచ్ తిగుళ్ల కనుకయ్య, ఉపసర్పంచ్ కర్ణాకర్‌రెడ్డి, వార్డు సభ్యులను శుక్రవారం ఆయన అభినందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ములుగు ప్రజలు మూడవసారి బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థికి పట్టం కట్టడం అభినందనీయమన్నారు. ప్రజల నమ్మకాన్ని కాదనకుండా నూతన సర్పంచ్‌లు అభివృద్ది, సంక్షేమ పథకాలను చేపట్టి ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కర్ణాకర్‌రెడ్డి, కనుకయ్య, నర్సింహులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఖేడ్, సంగారెడ్డిలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా
నేడు ఖేడ్, సంగారెడ్డిలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా


