మద్యం మత్తులో బావిలో పడి వ్యక్తి మృతి
జగదేవ్‌పూర్(గజ్వేల్): ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన పీర్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చంద్రమోహన్ కథనం మేరకు.. జగదేవ్‌పూర్‌కు చెందిన రాయారం కనకయ్య(40) సుజాత దంపతులు గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కొద్ది రోజులుగా కనకయ్య మద్యానికి బానిస కావడంతో భార్య తల్లిగారి ఇంటికెళ్లి అక్కడే ఉంటుంది. ఆదివారం పీర్లపల్లిలో అక్క ఇంటికి వెళ్లి వస్తానని తండ్రితో చెప్పి ఆదివారం సాయంత్రం బయలుదేరాడు. పీర్లపల్లికి కాలినడకనా వెళ్లి గ్రామ సమీపంలో అదే గ్రామానికి చెందిన కొమురయ్య వ్యవసాయ బావి వద్ద మద్యం సేవిస్తున్నాడు. కొమురయ్య చూసి పలకరించగా అక్క వెంకటమ్మ ఇంటికొచ్చానని చెప్పారు. అనంతరం బావి దగ్గర కాలకృత్యాలు తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. వెంటనే కనకయ్య వెంకటమ్మకు సమాచారం ఇచ్చాడు. అప్పటికే రాత్రి కావడంతో సోమవారం ఉదయం బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపారు.
డివైడర్‌ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు
గజ్వేల్‌రూరల్: డివైడర్‌ను ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ మార్గంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం పోలీసుల కథనం మేరకు.. గజ్వేల్ మండలం బెజుగామ గ్రామానికి చెందిన ముత్యాల పరశురాములు(32)కు భార్యతోపాటు ఇద్దరు పిల్లలున్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్ల కిందట బొంబాయికి వెళ్లారు. పిల్లల ఆధార్‌కార్డుల కోసం వారం రోజుల కిందట పరశురాములు దంపతులు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ(లక్ష్మాపూర్)లో ఉండే అత్తగారింటికి వచ్చారు. ఆదివారం రాత్రి ఒక్కడే బైక్‌పై గజ్వేల్ నుంచి లక్ష్మాపూర్ వైపు వస్తుండగా మార్గమధ్యలో రింగురోడ్డు వద్ద వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పరశురాములు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
బైక్‌ను డీసీఎం ఢీకొట్టడంతో వ్యక్తి
గజ్వేల్‌రూరల్: డీసీఎం వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ శివారులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మర్కూక్ మండలం పాతూరుకు చెందిన కొక్కండ వెంకటేశ్(38)కు భార్య హంస, కుమారుడు, కూతురు ఉన్నారు. కూరగాయ పంటలను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం కూరగాయలను తెంపుకొని బైక్‌పై పాతూరు కూరగాయల మార్కెట్‌కు వచ్చాడు. తిరిగి పొలానికి వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోని మహాలక్ష్మీ రబ్బర్ పరిశ్రమ వద్ద ఎదురుగా వచ్చిన డీసీఎం వెంకటేశ్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంకటేశ్‌ను చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గజ్వేల్ పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడు
పాపన్నపేట(మెదక్): రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ఆస్పత్రిలో పొందుతూ మృతి చెందాడు. మండల పరిధిలోని పోంలా తండాకు చెందిన లునావత్ సూర్య(30) నార్సింగి గ్రా మానికి చెందిన దుర్గయ్య బైక్‌పై 28న పాపన్నపేట వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో పెట్రోల్ బంకు వద్ద ముందుగా వెళ్తున్న టీవీఎస్ మోపెడ్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘనటలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. సూర్యకు బలమైన గాయాలు కావడంతో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
మద్యం మత్తులో బావిలో పడి వ్యక్తి మృతి
మద్యం మత్తులో బావిలో పడి వ్యక్తి మృతి


