గుంతలోకి దూసుకెళ్లిన బస్సు
మనోహరాబాద్(తూప్రాన్): అదుపుతప్పి బస్సు గుంతలోకి దూసుకెళ్లిన ఘటన మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ము ప్పిరెడ్డిపల్లి పరిశ్రమల వాడలోని లాంకో పరిశ్ర మలో పని చేసే ఉద్యోగులు, కార్మికులను పరిశ్రమ కు చెందిన బస్సులో నిత్యం ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు. సోమవారం హైదరాబాద్ నుంచి సుమారు 20 మందిని బస్సులో తీసుకొని వస్తున్నారు. మండలంలోని కూచారం వద్ద జాతీయ రహదారిపై యూటర్న్ వద్ద వాహనాన్ని తప్పించబోయి రోడ్డు పక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. బస్సు డ్రైవర్ సాయికి తీవ్రగాయాలు కాగా, మిగితా వారికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు.


