మానవత్వం చాటిన ఆర్టీసీ ఉద్యోగులు
జగదేవ్‌పూర్(గజ్వేల్): బంగారు ఆభరణాలు, నగదును బస్సులో మర్చిపోయిన వ్యక్తికి ఆర్టీసీ ఉద్యోగులు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన బంటు యాదగిరి కూతురు పెళ్లికి సంబంధించి ఏడు తులా ల బంగారం, రూ.2.5 లక్షల నగదును బ్యాగులో పెట్టుకొని సోమవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో భువనగిరి నుంచి యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం ఇంద్రానగర్‌కు బయలుదేరాడు. ఇంద్రానగర్ వెళ్లే ఆటో ఎక్కడానికి జగదేవ్‌పూర్ రాగానే బ్యాగును బస్సులోనే వదిలి హడావిడిగా దిగిపోయాడు. ఆ బ్యాగును గమనించిన డ్రైవర్ సలీం, కండక్టర్ ఓం ప్రకాశ్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. కొద్దిసేపటికి యాదగిరి జగదేవ్‌పూర్‌కు వచ్చి పోలీస్‌స్టేషన్‌కు విషయాన్ని చెప్పాడు. ఎస్‌ఐ చంద్రమోహన్ బంగా రం, నగదు బ్యాగును బాధితుడికి అప్పగించారు.


