ఫిట్‌నెస్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ తప్పనిసరి

May 27 2025 7:37 AM | Updated on May 27 2025 7:37 AM

ఫిట్‌

ఫిట్‌నెస్‌ తప్పనిసరి

స్కూల్‌ బస్సుల యజమానులకు అధికారుల హెచ్చరిక

జూన్‌ 12వ తేదీన విద్యాసంస్థలు ప్రారంభం

ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌ చేయించుకున్న 350 ప్రైవేట్‌ విద్యాసంస్థల బస్సులు

ఇంకా రావాల్సి ఉన్న 350

నియమ నిబంధనలు పాటించాలని సూచనలు

పటాన్‌చెరు టౌన్‌: ప్రైవేట్‌ పాఠశాలల బస్సుల ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడూ సంబంధిత యాజమాన్యాలు పర్యవేక్షించాలి. జూన్‌ 12వ తేదీన విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపే బస్సులకు మళ్లీ ఫిట్‌ నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఆర్టీవో కార్యాలయంలో వివిధ స్కూళ్లకు చెందిన 350 బస్సులకు ఫిట్‌ నెస్‌ చేసి సర్టిఫికెట్‌ అందజేశారు. అయితే ఇంకా 350 బస్సులు ఫిట్‌నెస్‌ చేయించుకోవాల్సి ఉందని రవాణా శాఖ అధికారులు తెలిపారు.

ఫిట్‌నెస్‌కు వస్తున్న బస్సులు

పటాన్‌చెరు మండల పరిధిలోని ఇంద్రేశం సమీపంలోని రవాణా శాఖ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పటాన్‌చెరు, అమీన్‌పూర్‌, రామచంద్రాపురం, జిన్నారం, బొల్లారం, గుమ్మడిదల మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన స్కూళ్ల బస్సులకు ఫిట్‌ నెస్‌ చేయించుకుంటాయి. ప్రతీ ఏడాది స్కూల్‌ ప్రారంభానికి ముందు ఆర్టీవో కార్యాలయానికి వచ్చి బస్సులను ఫిట్‌ నెస్‌ చేయిస్తారు. ఫిట్‌నెస్‌ లేకుండా పాఠశాలల బస్సులు తిరిగితే సీజ్‌ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు స్కూళ్లలో విద్యార్థుల నమోదును పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. విద్యార్థులను నేరుగా ఇంటి నుంచి తీసుకెళ్లి.. తిరిగి సాయంత్రం ఇంటి వద్ద విడిచి పెడతామని చెబుతున్నారు. పట్టణంలో, మండలంలో ఉండే విద్యార్థులు కోసం ప్రైవేట్‌ పాఠశాలల వారు బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బస్సు రవాణా చార్జీలు వసూలు చేస్తున్నారు.

పాటించాల్సిన నిబంధనలు

● విద్యా సంస్థల బస్సులు విధిగా పసుపు రంగులోనే ఉండాలి.

● బస్సులో సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకోవద్దు.

● బస్సు నడిపే డ్రైవర్‌కు హెవీ వెహికల్‌ లైసెన్స్‌ ఉండాలి. అదే విధంగా డ్రైవర్‌ వయసు 55 ఏళ్లలోపు ఉండాలి. బస్సు నడిపేందుకు ఐదేళ్ల అనుభవం కలిగి ఉండాలి.

● మద్యం తాగి వాహనం నడిపితే లైసెన్స్‌ రద్దు అవుతుంది.

● పాఠశాలల బస్సు పదిహేనేళ్ల కాలపరిమితి దాట కూడదు

● కుడి ఎడమవైపు పాఠశాలల పేరు చిరునామా స్పష్టంగా రాయాలి.

● డ్రైవర్‌ లైసెన్స్‌ను పాఠశాాల యాజమాన్యం విధిగా ఆర్టీఏ కార్యాలయంలో అందించాలి.

● బస్సులో ప్రథమ చికిత్స కిట్టు, ఫైర్‌కు సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉండాలి.

● అత్యవసర ద్వారం ఉండాలి, బస్సు డ్రైవర్‌ అటెండర్‌ ఫోన్‌ నంబర్లు విధిగా ఉంచాలి.

● నెలకు ఒకసారి బస్సు డ్రైవర్‌కు బీపీ, షుగర్‌, కంటి పరీక్షలు విధిగా చేయించాలి.

● డ్రైవర్‌, అటెండర్‌కు కచ్చితంగా యూనిఫామ్‌ ధరించాలి.

● విద్యార్థులను స్కూలుకు తీసుకెళ్లే సమయంలో తిరిగి ఇంటి వద్ద వదిలే సమయంలో విద్యార్థులందరూ బస్సు దిగారా లేదా చూసుకోవాలి.అలాగే రోడ్డు దాటించాల్సిన వస్తే వారిని దాటించాలి.

ఫిట్‌నెస్‌ లేని బస్సులు సీజ్‌ చేస్తాం

ప్రైవేట్‌ విద్యా సంస్థల బస్సులు తప్పనిసరిగా ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి. పటాన్‌చెరు రవాణా శాఖ కార్యాలయంలో ఇప్పటి వరకు 350 వివిధ విద్యా సంస్థల బస్సులకు ఫిట్‌ నెస్‌ చేశాం. మిగితా 350 బస్సులకు ఫిట్‌నెస్‌కు రావాల్సి ఉంది. జూన్‌ 12వ తేదీ పాఠశాలలు ప్రారంభం నేపథ్యంలో ముందుగానే బస్సులకు ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి. ఫిట్‌నెస్‌ లేకుండా రోడ్ల పై తిరిగితే బస్సులను సీజ్‌ చేయడంతోపాటు చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటాం.

– విజయరావు, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌

ఫిట్‌నెస్‌ తప్పనిసరి1
1/2

ఫిట్‌నెస్‌ తప్పనిసరి

ఫిట్‌నెస్‌ తప్పనిసరి2
2/2

ఫిట్‌నెస్‌ తప్పనిసరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement