
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
మరో యువకుడికి తీవ్ర గాయాలు
రామాయంపేట(మెదక్): బైక్‌ను లారీ ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన రామాయంపేట వద్ద చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన ఇద్దరు స్నేహితులు బూస నిఖిల్ (24), మల్లాపురం నితీశ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. శనివారం ఇద్దరూ స్వగ్రామానికి వచ్చారు. సోమవారం బైక్‌పై మళ్లీ హైదరాబాద్ వెళ్తుండగా రామాయంపేట వద్దకు రాగానే అతి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన నితీశ్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. మృతుడు నిఖిల్ తండ్రి లింబాద్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కారు, బైక్ ఢీ : యువకులకు గాయాలు
దుబ్బాకరూరల్: కారు బైక్‌ను ఢీకొట్టడంతో యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన అక్బర్‌పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట వద్ద చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. పోతారెడ్డి పేట గ్రామానికి చెందిన రాజు, స్వామి, మణికంఠ డబుల్ బెడ్ రూం ఇళ్ల నుంచి గ్రామంలోకి వెళ్తున్నారు. సిద్దిపేట వైపు నుంచి రామాయంపేట వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకులకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్సులో సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ
చిన్నశంకరంపేట(మెదక్): ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టిన ఘటన చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. స్థానిక పరిశ్రమ నుంచి స్టీల్ లోడ్ చేసుకొని పెట్రోల్ పంపు వద్దకు వచ్చిన లారీ నిలిపి ఉన్న ట్రాక్టర్ ఇంజన్‌ను ఢీకొట్టింది. ఈ సమయంలో ట్రాక్టర్ డ్రైవర్ పక్కన ఉండటంతో ప్రమాదం తప్పింది. ట్రాక్టర్‌ను కొద్ది దూరం లాక్కెళ్లడంతో మెదక్ రోడ్డుపై ట్రాఫిక్ ట్రామ్ అయ్యింది. స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ధాన్యం కుప్పను ఢీకొని గాయాలు
వెల్దుర్తి(తూప్రాన్): రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పను బైక్‌తో ఢీకొట్టడంతో వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని మెల్లూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని మెల్లూర్ గ్రామానికి చెందిన దాసరి కిరణ్(30) సోమవారం రాత్రి పని నిమిత్తం బైక్‌పై వెల్దుర్తి వెళ్తున్నాడు. వెల్దుర్తి–మెల్లూర్ గ్రామ శివారులో బీటీ రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పను ఢఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ధాన్యం లోడ్ ట్రాక్టర్ బోల్తా
వర్గల్(గజ్వేల్): రోడ్డు మధ్య భారీ గుంతలతో ధాన్యపు లోడ్ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం వర్గల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఇటీవలె వర్షాలకు వర్గల్ తహసీల్దార్ కార్యాలయం ముందర ప్రధాన రోడ్డుపై భారీ గుంతులు ఏర్పడ్డాయి. వర్షపు నీటితో నిండిపోవడంతో గుంతలు గుర్తించే అవకాశం లేకుండా పోయింది. సోమవారం సాయంత్రం గౌరారం వైపు నుంచి మాధవరెడ్డి అనే రైతుకు చెందిన 118 ధాన్యపు బస్తాల లోడ్‌తో ట్రాక్టర్ వర్గల్ పారిశ్రామికవాడలోని రైస్‌మిల్‌కు వెళ్తుంది. తహసీల్దార్ కార్యాలయ సమీపంలో గుంతల కారణంగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి