
ఇసుక ట్రాక్టర్ సీజ్
మద్దూరు(హుస్నాబాద్): దూల్మిట్ట మండలంలోని జాలపల్లి వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం రెవెన్యూ సిబ్బంది పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం తహసీల్దార్ మధుసూదన్ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనవారు నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌కు విద్యార్థి ఎంపిక
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని కపూర్‌నాయక్ తండా గ్రామానికి చెందిన భానోతు మంగ– రాజు దంపతుల కుమార్తె షణ్ముఖ జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్‌కు ఎంపికై ంది. ఆమె నంగునూర్ మండలంలోని గట్లమల్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుదోంది. ఈ నెల 2,3,4వ తేదీల్లో జగిత్యాలలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో మంచి ప్రతిభ కనబరించింది. దీంతో 27వ తేదీన చండీఘర్‌లో జరగనున్న జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో ఆడనుంది. ఓ మారుమూల గిరిజన తండాకు చెందిన షణ్ముఖ జాతీయస్థాయికి ఎంపిక కావడం పట్ల తండావాసులు, కాంగ్రెస్ నాయకులు అజ్మీర అనిల్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే గట్లమల్యాల ఉన్నత పాఠశాల 1999–2000 సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చి ఆమెకు రూ.6వేల ఆర్థిక సాయం అందజేసి సన్మానించారు.
వ్యక్తి అదృశ్యం
చేగుంట(తూప్రాన్): బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్న వ్యక్తి అదృశ్యమైన ఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... జెత్రం తండాకు చెందిన జాటోత్ లక్ష్మణ్ తన భార్య లక్ష్మితో కలిసి ఈనెల 20న శివ్వంపేట మండలం తులపల్లి తండాకు బంధువుల ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తూప్రాన్ నుంచి బస్సులో ఇంటికి వస్తుండగా మాసాయిపేట బస్సు స్టేషన్‌లో లక్ష్మణ్ బస్సు దిగి ఎంతకు రాలేదు. దీంతో భర్త ఆచూకీ కోసం భార్య వెతికినా ఫలితం కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
చేగుంట(తూప్రాన్): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని పోతాన్‌పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... పోతాన్‌పల్లి గ్రామానికి చెందిన అరికెల బూదయ్య(57) జీఎంఆర్ హైవేస్ ఆధీనంలో ఉన్న జాతీయ రహదారిపై కూలీపనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 15న జీఎంఆర్ హైవేస్ పెట్రోలింగ్ వాహనం రామంతాపూర్ శివారులో చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వామి, బూదయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. బూదయ్యకు ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స చేయించి శుక్రవారం ఇంటికి తీసుకొచ్చారు. శనివారం రాత్రి బూదయ్య మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇసుక ట్రాక్టర్ సీజ్

ఇసుక ట్రాక్టర్ సీజ్