
స్విమ్మింగ్లో సిద్దిపేట స్విమ్మర్స్ ప్రతిభ
సిద్దిపేటజోన్: తెలంగాణ రాష్ట్ర స్థాయి 10వ స్విమ్మింగ్ ఛాంపియన్ 2025లో సిద్దిపేట స్విమ్మర్స్ ప్రతిభ కనబర్చారు. ఆదివారం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో జరిగిన పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు శ్రీహర్ష ప్రియా, భారతి ప్రతిభ చూపారు. 50 మీటర్ల బటర్ఫ్లై విభాగంలో శ్రీహర్ష, 50మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో భారతి మూడవ స్థానంలో నిలిచారు. వీరికి రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

స్విమ్మింగ్లో సిద్దిపేట స్విమ్మర్స్ ప్రతిభ