
‘నీట్’ కేంద్రాల వద్ద బందోబస్తు
సంగారెడ్డి జోన్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) ఈ నెల 4 జరుగనున్న నేపథ్యంలో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద ప్రభుత్వం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తునట్లు ఎస్పీ పరితోశ్ పంకజ్ స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 7 పరీక్ష కేంద్రాల్లో 3,320 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....మధ్యాహ్నం 2 గం. నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పరీక్షకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 01:30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 125 బీఎన్‌ఎస్ సెక్షన్ (144) అమలులో ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్స్ ఎవ్వరూ ఎలక్ట్రానిక్ పరికరాలను లోపలికి తీసుకురాకూడదన్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌తోపాటు గుర్తింపు కార్డ్, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు, ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోను తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. బంగారు, వెండి తదితర ఆభరణాలు షూస్, సాక్స్ ధరించకూడదని స్పష్టం చేశారు. ఎస్పీ వెంట సంగారెడ్డి డీఎస్పీ సత్యయ్య గౌడ్, జోగిపేట్ సీఐ అనిల్ కుమార్, సంగారెడ్డి రూరల్ ఎస్.ఐ క్రాంతికుమార్ ఉన్నారు.
ఎస్పీ పరితోశ్ పంకజ్