
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
జేసీబీ, బైక్ ఢీకొని యువకుడు
తూప్రాన్: జేసీబీ, బైక్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని నర్సంపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివానందం కథనం మేరకు.. దౌల్తాబాద్ మండలం మాచిన్‌పల్లి గ్రామానికి చెందిన బాలక్రిష్ణ(22) మేసీ్త్ర పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నర్సంపల్లి మీదుగా గజ్వేల్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న జేసీబీ ఢీకొని తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ తెలిపారు.
మినీ వ్యాను బోల్తా పడి ఒకరు..
చేగుంట(తూప్రాన్): మినీ వ్యాను బోల్తాపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మాసాయిపేట మండలం బొమ్మారం గేటు సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి కథనం మేరకు.. ఆదిలాబాద్ జిల్లా ముక్రా గ్రామానికి చెందిన ఖలీల్‌బాషా(38) మినీ వ్యాను డ్రైవర్‌గా పని చేస్తున్నాడు, బుధవారం తెల్లవారు జామున బాలానగర్‌లో సరుకులు లోడ్ చేసుకొని భీంగల్‌కు వస్తున్నాడు. ఈక్రమంలో బొమ్మారం గేటు వద్ద వ్యాను అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వ్యాను నడుపుతున్న ఖలీల్‌బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి కుటుంబీకులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభు త్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బైక్‌ను ట్రాక్టర్ ఢీకొని మరొకరు
ములుగు(గజ్వేల్): రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ములుగు మండలం కొత్తురు గ్రామ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ విజయ్‌కుమార్ కథనం మేరకు.. మండలంలోని కొక్కొండ గ్రామానికి చెందిన కుమ్మరి రాజు(40) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. బుధవా రం బైక్‌పై మేడ్చల్‌కు పెయింటింగ్ పనికి వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికొస్తున్నాడు. మార్గమధ్య లో కొత్తూరు బ్రిడ్జి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుమ్మరి రాజు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు.

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి