
అరుదైన ‘వీరగల్లు’ శిల్పాలు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలోని గౌరయపల్లి గ్రామంలో పులివేట వీరగల్లుల రాతి శిల్పాలు ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వాటిని పరిశీలించి 17 శతాబ్దానికి చెందినవిగా పేర్కొన్నారు. కన్నడ భాషలో హళిబేటె అని పిలిచే ఈ పులివేట వీరగల్లుల శిలా రూపాలు తెలంగాణలో మూటకోడూర్, నిజామాబాద్, గోనేపల్లి, అమ్మనబోలు వంటి ప్రదేశాల్లో గతంలో లభించాయని పేర్కొన్నారు. గ్రామం మీద పెద్ద పులిదాడి చేసిన సమయంలో వీరుడు వాటితో పోరాడి ప్రజల్ని కాపాడి మరణం పొందిన సందర్భంగా వేసిన వీరశిలలుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ మూడు రాతి శిల్పాల్లో రెండు పులితో వేటాడుతున్నవి, మూడవది శైవ భక్తుడు తన సిగముడిని వంచిన వెదురుగడకోసకు కట్టుకొని అంజలిపట్టి యోగా సనం కుర్చున్నట్లు తెలిపారు. వీటి శిల్పశైలీని బట్టి రాష్ట్ర కుటుల కాలం నాటి శిల్పాలుగా పేర్కొన్నారు. ఆయన వెంట కొత్త తెలంగాణ చరిత్ర బృందానికి చెందిన హరగోపాల్ పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో వెలుగులోకి
పరిశీలించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు శ్రీనివాస్

అరుదైన ‘వీరగల్లు’ శిల్పాలు