
‘బసవ జయంతి’కి సీఎం రేవంత్‌కు ఆహ్వానం
జహీరాబాద్ టౌన్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించే విశ్వగురువు మహా మానవతావాది మహాత్మ బసవేశ్వరుడి జయంతి వేడుకలకు హాజరుకావాలని రాష్ట్రీయ బసవదళ్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించింది. ఈ మేరకు ఈ సంఘం తెలంగాణ అధ్యక్షుడు శంకర్‌పాటిల్, ఎంపీ సురేశ్ షెట్కార్, లింగాయత్ సమాజ్ నాయకులతో వెళ్లి హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ను కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించారు. అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ...బసవేశ్వరుడి 892వ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ప్రభుత్వం ఆధికారికంగా నిర్వహిస్తుందన్నారు. జిల్లాతోపాటు జహీరాబాద్, నారాయణఖేడ్‌ల నుంచి రాష్ట్రీయ బసవదళ్ శ్రేణులు, అభిమానులు భారీగా తరలిరావాలని కోరారు.
రైతుల సంక్షేమమే
ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
కల్హేర్(నారాయణఖేడ్): రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బీబీపేట్‌లో పీఎసీఏస్ ఆధ్వర్యంలో మంగళవారం జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జొన్నలను ఈ కేంద్రాల్లో కొనుగోలు చేయడం ద్వారా రైతులు మద్దతు ధర పొందవచ్చని తెలిపారు. ధరణిలో తప్పుల కారణంగా ప్రభుత్వం కొత్తగా భూ భారతి చట్టం తెచ్చిందని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ నరేందర్‌రెడ్డి, పీఎసీఏస్ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ గుండు మోహన్, నాయకులు వినోద్ పాటిల్, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.
మేడేను జయప్రదం చేయండి
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు
పటాన్‌చెరు టౌన్: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడేను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శ్రామికభవన్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. 1886 మే 01న అమెరికాలోని చికాగోలో కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె జరిపితే కార్మిక వర్గం పై ఆనాటి పాలకులు కుట్రలు కుతంత్రాలతో విచ్ఛిన్నం చేసిందని, ఆ పోరాటంలో నలుగురు కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కార్మిక చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కి పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జయరాం, దుర్గా, చంద్రకిరణ్‌సింగ్, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నాయీబ్రాహ్మణులు
రాజకీయంగా ఎదగాలి
సంగారెడ్డి: నాయీబ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని సర్పంచుల ఐక్య వేదిక వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు అందోల్ కృష్ణ పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన చౌటకూర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ఆ సంఘం సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. దశబ్దాల తరబడి నాయీబ్రహ్మణులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో నాయీబ్రాహ్మణులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వృత్తి జీవనంలోనే జీవితాలు వెళ్లదీస్తున్నారని పేర్కొన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ సహకారంతో నాయీబ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానని తెలిపారు.

‘బసవ జయంతి’కి సీఎం రేవంత్‌కు ఆహ్వానం