
పొన్నంకు కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ బాధితుడు
హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ పట్టణానికి చెందిన చొప్పరి లింగయ్య ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాడు. అక్కడ అనారోగ్యంతో పని చేయలేక స్వదేశం రావడానికి చేతిలో డబ్బులు లేక అక్కడే ఉండిపోయాడు. స్వదేశానికి రావడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయం చేయాలని కోరాడు. స్పందించిన మంత్రి టికెట్‌కు డబ్బులు ఇచ్చి ఎన్‌ఆర్‌ఐ అడ్వైజర్ కమిటీ చైర్మన్ వినోద్‌కుమార్‌ను లింగయ్య దగ్గర పంపించి భరోసా కల్పించి ఇంటికి పంపించాడు. సోమవారం మంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపాడు.
చెక్‌డ్యాం ధ్వంసం చేశారని రైతుల ఆందోళన
బెజ్జంకి(సిద్దిపేట) : శనిగరం ప్రాజెక్టు నుంచి ముత్తన్నపేట, దాచారం గ్రామాలకు సాగునీరు వచ్చే కాల్వ చెక్‌డ్యాం ధ్వంసం చేయడంపై ఆగ్రహించిన ముత్తన్నపేట రైతులు సోమ వారం నర్సింహుపల్లె శివారులోని వైట్ ఫీల్డ్ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేశారు. వ్యర్థ జలాలు కాల్వలోకి వదలడానికి కంపెనీ వారే కాల్వ, చెక్ డ్యాంలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రైతులను సముదాయించి సమస్య ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కాల్వ నీటిని కాలుష్యం చేసేలా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవలని డిమాండ్ చేసి రైతులు వెనుదిరిగి వెళ్లారు.

పొన్నంకు కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ బాధితుడు