
మెరుగైన వైద్య సేవలతోనే గుర్తింపు
ములుగు(గజ్వేల్) : గ్రామీణ పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించినప్పుడే వైద్యులకు సమాజంలో గుర్తింపు లభిస్తుందని కేఎన్‌ఆర్ యూహెచ్‌ఎస్ వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్. నందకుమార్‌రెడ్డి అన్నారు. ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్‌వీఎం మెడికల్ కళాశాలలో చైర్మన్ డాక్టర్.యాకయ్య అధ్యక్షతన జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. వైద్య విద్య గ్రాడ్యుయేషన్‌తో నూతన సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పరిశోధన, ఉత్తమ పద్ధతి, పురోగతితో జ్ఞానం, నైపుణ్యత పెంచుకోవడానికి దోహదపడుతుందన్నారు. గ్రాడ్యుయేట్ వైద్యులు నిత్య విద్యార్థిగా భావిస్తూ ఆరోగ్య నిపుణుల సలహాలను స్వీకరించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ రంజిత్‌రెడ్డి, సీఈఓ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
కేఎన్‌ఆర్ యూహెచ్‌ఎస్‌వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్.నంద కుమార్‌రెడ్డి