
తాగునీటి సరఫరాకు మరమ్మతులు
కంగ్టి(నారాయణఖేడ్): కంగ్టి మండలంలోని రాజారాంతండా గ్రామపంచాయతీ పరిధి లోని సాధుతండాలో తాగునీటి సరఫరాకు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఓవర్ హెడ్ ట్యాంకులో 40కి పైగా పైపులు వేసి నీటిని వాడుకోవడానికి గిరిజనులు పడుతున్న తంటాలపై ‘తాగునీటికి తండా వాసుల తంటా’శీర్షికన గురువారం ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. రెండు ప్రధాన పైపులు వేసి వాల్వ్‌లు బిగించడంతోపాటు ఇంటింటికీ ఫ్లో కంట్రోల్ వాల్వ్‌లు బిగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాజు తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, పంచా యతీ రాజ్ అధికారుల సమన్వయంతో నీటి సరఫరాను పునరుద్ధరించనున్నట్లు రూరల్ వాటర్ సప్‌లై కంగ్టి ఏఈ జైపాల్ తెలిపారు.
రేపు వట్‌పల్లిలో
భూ భారతి సదస్సు
వట్‌పల్లి(అందోల్): మండల కేంద్రమైన వట్‌పల్లిలో ఈ నెల 29న మంగళవారం ఉదయం 11 గంటలకు వట్‌పల్లిలోని వెంకటఖ్వాజా దర్గా ఫంక్షన్ హాల్‌లో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ మేరకు తహసీల్దార్ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ అవగాహన సదస్సుకు కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్ మాధురి, అందోలు ఆర్డీఓ పాండు, మండల ప్రత్యేక అధికారితోపాటు ఇతర శాఖల అధికారులు హాజరుకానున్నట్లు తెలిపారు.
ముందుగా చెల్లిస్తే
5 శాతం పన్ను రాయితీ
ఖేడ్ మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్
నారాయణఖేడ్: ఖేడ్ మున్సిపల్ పరిధిలోని ప్రజలు ఆస్తిపన్నును ఈ నెల 30వ తేదిలోపు చెల్లించి 5% పన్ను రాయితీ పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పేర్కొన్నారు. 2025–26 ఆర్థిక ఏడాదికి చెందిన పన్ను అడ్వాన్స్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఏటా ప్రజలు సహకరించడంతో నారాయణఖేడ్ ఉత్తమ మున్సిపాలిటీగా ఎంపికై దన్నారు. ప్రజలు పన్ను చెల్లింపు ఈ నెలాఖరు వరకు పూర్తి చేసి రాయితీ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
చాంపియన్‌షిప్‌కు కల్పన
మునిపల్లి(అందోల్): 54వ రాష్ట్ర హ్యాండ్ బాల్ సీనియర్ మహిళల చాంపియన్ షిప్ పోటీలకు బుదేరా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని బి.కల్పన ఎంపికై ంది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ మాధవి, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బీబీఏ సెకండియర్ చదువుతున్న బి.కల్పన ఈ నెల 29న సికింద్రాబాద్‌లో జింఖానా గ్రౌండ్, 30న ఆదిలాబాద్‌లోని మందమర్రి సింగరేణి స్కూల్ గ్రౌండ్ వేదికగా జరిగే క్రీడాపోటీల్లో కల్పన పాల్గొంటారు.
భగీరథా.. తాగునీరు వృథా
జిన్నారం (పటాన్‌చెరు): బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో మిషన్‌భగీరథ పైపులైన్ లీకేజీతో తాగునీరు వృథాగా పోతోంది. అస్తవ్యస్తంగా పైపులైన్‌ను ఏర్పాటుచేయడంతో లీకేజీ ఏర్పడి తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీరు వృథాకాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఉగ్రవాదులను శిక్షించాలి
డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన
పటాన్‌చెరు టౌన్: ఉగ్రదాడులకు పాల్పడ్డ తీవ్రవాదులను కఠినంగా శిక్షించాలని డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హరినాథ్‌రెడ్డి, హాసన్‌లు డిమాండ్ చేశారు. కశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని నిరసిస్తూ ఆదివారం పట్టణంలోని శ్రామిక్ భవన్ దగ్గర ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఉగ్రదాడి బాధితులను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఉగ్రదాడి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరారు.

తాగునీటి సరఫరాకు మరమ్మతులు