
ఏమైనా ఇబ్బందులున్నాయా!
రోగులను ఆరా తీసిన న్యాయమూర్తి
జహీరాబాద్ టౌన్: జహీరాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని శనివారం సీనియర్ సివిల్ జడ్జి జి.కవితాదేవి ఆకస్మిక తనిఖీ చేశారు. ఇటీవలే గద్వాల్ నుంచి జహీరాబాద్‌కు బదిలీపై వచ్చిన కవితాదేవి ఆస్పత్రిలోని అన్ని వార్డులను కలియదిరిగారు. రోగులతో మాట్లాడి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. మహిళా వార్డుకు వెళ్లి గర్భిణీలతో మాట్లాడి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు.
దత్తగిరిలో శాంతి ర్యాలీ
ఝరాసంగం(జహీరాబాద్): పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. శనివారం రాత్రి ఆశ్రమంలో మహామండలేశ్వర్ డా.సిద్దేశ్వర్ స్వామి, వైదిక పాఠశాల విద్యార్థులు, గ్రామస్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ఏమైనా ఇబ్బందులున్నాయా!