అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు చోరీ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు చోరీ

Apr 27 2025 7:54 AM | Updated on Apr 27 2025 7:54 AM

అంగన్

అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు చోరీ

జహీరాబాద్‌ టౌన్‌: మండలంలోని మల్‌చెల్మ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం నం.3లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. అంగన్‌వాడీ కేంద్రం తలుపులను గుర్తు తెలియని దొంగలు పగులగొట్టి 17 ట్రేల గుడ్లు, 4 పప్పు ప్యాకెట్లు, 6 లీటర్ల పాలు, బాలమృతం ప్యాకెట్లను ఎత్తుకెళ్లారు. అంగన్‌వాడీ టీచర్‌ మధుమతి శనివారం కేంద్రం వద్దకు వెళ్లగా తలుపులు పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా సరుకులు కనిపించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు టీచర్‌ తెలిపారు.

పిచ్చి కుక్క దాడిలో

ఏడుగురికి గాయాలు

మిరుదొడ్డి(దుబ్బాక): మండల కేంద్రమైన మిరుదొడ్డిలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. దొరికినవారిని దొరికినట్లు ఏడుగురిపై విచక్షణా రహితంగా దాడి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మిరుదొడ్డిలో శుక్రవారం రాత్రి ఓ పిచ్చి కుక్క యువకుడితోపాటు, ముగ్గురు బాలురు, ఇద్దరు మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఇందులో చిన్నారి ఫక్కీరుగల్ల లోకేశ్‌, పుల్లూరి ప్రశాంత్‌ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొగుళ్ల రాజు, ఎం.ఎల్లవ్వ, పెద్ద కుర్మ సత్తవ్వ, మనోజ్‌ కుమార్‌, ర్యాకం భానోదయ్‌ మిరుదొడ్డి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. కాగా గ్రామంలో తిరుగుతున్న పిచ్చి కుక్కను గుర్తించిన గ్రామస్తులు శనివారం ఉదయం చంపేశారు. ఊరిలో కుక్కలను కట్టడి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రమాదవశాత్తు వరి పంట దగ్ధం

బెజ్జంకి(సిద్దిపేట): ప్రమాదవశాత్తు వరి పంట దగ్ధమైన ఘటన మండలంలోని పెరుకబండలో చోటు చేసుకుంది. విద్యుత్‌ వైర్లు ఒకదానికి ఒకటి తగిలి నిప్పులు చెలరేగి గ్రామానికి చెందిన గౌరి నర్సయ్య వరి పంట దగ్ధమైంది. అది గమనించిన రైతు నీళ్లు చల్లి మంటలార్పివేశారు. మూడు ఎకరాల వరి పొలంలో సుమారు 5 గుంటల వరకు దగ్ధమైంది. తమ వరి పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలిగించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికై నా తొలగించాలని కోరారు.

మహిళ అదృశ్యం

రామాయంపేట(మెదక్‌): రామాయంపేట పట్టణానికి చెందిన మహిళ అదృశ్యమైనట్లు శనివారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన మతం ఎల్లవ్వ, ఆమె కూతురు మతం రాజేశ్వరీ ఐదు నెలల కిందట వరంగల్‌ నుంచి రామాయంపేటకు వచ్చి తల వెంట్రుకల వ్యాపారం చేసుకుంటున్నారు. ఐదు రోజుల కిందట వ్యాపారం నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిన రాజేశ్వరీ తిరిగి రాలేదు. బంధువుల వద్ద, ఇతర చోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో ఎల్లవ్వ శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్‌ తెలిపారు.

అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు చోరీ 1
1/1

అంగన్‌వాడీ కేంద్రంలో గుడ్లు, పాలు చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement