
లక్ష్యాన్ని చేరుకోవడానికి క్రమశిక్షణ అవసరం
గజ్వేల్‌రూరల్: విద్యార్థి దశలో క్రమశిక్షణతో మెలిగినపుడే లక్ష్యాన్ని చేరుకోగలమని సౌత్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఫౌండర్, నిజాం ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ టామ్ చెరియన్ అన్నారు. శనివారం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 17వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ అనిత అబ్రహం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ సుమితరాయ్, మరో అతిథి జార్జ్ మార్షల్‌లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకొన్నాయి. అనంతరం టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ప్రశంసాపత్రాలు, మెడల్స్‌తో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, సీపీడీసీ సభ్యులు నరేశ్‌బాబు, లక్ష్మణ్, శైలజ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.