
వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం
వట్‌పల్లి(అందోల్): బాలిక అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ శ్రీకాంత్ వివరాల ప్రకారం... మండల పరిధిలోని బిజిలీపూర్ గ్రామానికి చెందిన డప్పు గీత(15) అందోలు రెసిడెన్సియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వార్షిక పరీక్షల అనతరం పాఠశాల నుంచి ఇంటికి వచ్చింది. ఈనెల 18న రాత్రి తన కుటుంబీకులతో కలిసి భోజనం చేసి అందరూ నిద్రకు ఉపక్రమించిన తర్వాత తెల్లవారు జామున ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు లేచి చూసే సరికి కూతురు కనిపించకపోవడంతో చుట్టు పక్కల వెతికినా ఆచూకీ కనిపించలేదు. దీంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కళాశాలకు వెళ్లిన విద్యార్థి..
జహీరాబాద్ టౌన్: కళాశాలకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. ఎస్‌ఐ.కాశీనాథ్ కథనం ప్రకారం... పట్టణంలోని అహ్మద్‌నగర్‌కు చెందిన ఎండీ షమీమ్‌కు ఇద్దరు కొడుకులు, ఐదుగురు ఆడపిల్లలు. ఐదో కూతురు షాహీదా ఖుతున్(20) స్థానిక ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ నెల 23న అక్క ఆయేషా ఖుతున్‌తో కలిసి కళాశాలకు వెళ్లింది. సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.

వేర్వేరు చోట్ల ఇద్దరు అదృశ్యం