
ప్రాణం తీసిన ఈత సరదా
చేగుంట(తూప్రాన్): ఈత కొట్టడానికి వెళ్లి యువకుడు మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు.. చేగుంటకు చెందిన తిరుపతి సంజయ్ (21) రామాయంపేట మండలం దామర చెరువులోని బంధువుల ఇంటికి వెళ్లాడు. శనివారం పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లా పెద్దమల్లారెడ్డి గ్రామంలో బంధువులు, స్నేహితులు అంతా కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఈతకొట్టడానికి వెళ్లారు. స్విమ్మింగ్‌పూల్ లోకి దూకిన సందీప్ తలకు గాయమై ఫిట్స్ రాగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే అంబులెన్స్‌లో రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా సందీప్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బట్టలు ఉతకడానికి వెళ్లి మహిళ
రామాయంపేట(మెదక్): చెరువులో మునిగి మహిళ మృతి చెందిన ఘటన రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ బాల్‌రాజ్ కథనం మేరకు.. మున్సిపాలిటీ పరిధిలోని గుల్పర్తి గ్రామానికి చెందిన బొగ్గుల అమృత (40) శుక్రవారం సాయంత్రం బట్టలు ఉతకడానికి గాను సమీపంలో ఉన్న పాండ చెరువు వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. శనివారం ఉదయం ఆమె మృతదేహం నీటిలో తేలగా కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
కామారెడ్డి జిల్లాలో చేగుంట యువకుడు మృతి