
జేఈఈ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు
హుస్నాబాద్‌రూరల్: దేశవ్యాప్తంగా విడుదల చేసి న జేఈఈ మెయిన్స్ సెషన్–2 ఫలితాల్లో గిరిజన గురుకుల విద్యార్థులు ప్రతిభ చూపించి 26 మంది అర్హత సాధించారు. శనివారం గిరిజన గురుకుల ప్రతిభా కళాశాలలో ఫలితాలను సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ రాజు అభినందించారు. కళాశాల నుంచి 31 మంది పరీక్షలకు హాజరైతే 26 మంది అర్హత సాధించగా 10 మంది మంచి మా ర్కులు పొందినట్లు చెప్పారు. బీ.సునీల్ (81.98), టీ.రాజేశ్(81.94), జే.హర్షవర్ధన్ (81.72), డీ.సిద్ధార్థ (77.33), బీ.మోక్షజ్ఞ (77.04) మార్కులు సాధించారు. గురుకులాల కేంద్ర కార్యాలయం అందించిన స్టడీ మెటీరియల్ చదువడం ద్వారానే మా విద్యార్థులు ఫలితాలను సాధించినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.

జేఈఈ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు

జేఈఈ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు

జేఈఈ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులు