
చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి టౌన్: రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట పీఎసీఎస్ కార్యాలయ ఆవరణలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా మాట్లాడుతూ..రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం సగం మందికి చేసి చేతులు దులుపుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వరి ధాన్యానికి మద్దతుధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 బో నస్ ఇస్తామన్నారని, దొడ్డు రకం ధాన్యానికి కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పట్నం మాణిక్యం, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నేడు ఉచిత
కంటి వైద్య శిబిరం
నారాయణఖేడ్: సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 17న గురువారం సత్యసాయి మందిరంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సత్యసాయి సేవా సమితి బాధ్యులు తెలిపారు. శిబిరంలో కంటి సమస్యలున్న వారికి ఉచితంగా చికిత్సతోపాటు శస్త్రచికిత్సలు నిర్వహిస్తారని వెల్లడించారు. పూర్తి వివరాలకు 9676171527 నంబరులో సంప్రదించాలని సూచించారు.
28 నుంచి వేసవి
శిక్షణ తరగతులు
నారాయణఖేడ్: ఖేడ్ శ్రీసరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ఈనెల 28 నుంచి వచ్చేనెల 18 వరకు సంస్కార సాధనావర్గ వేసవి శిక్షణా శిబిరం–2025 నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 5 నుంచి 15 ఏళ్ల బాలబాలికలకు చిత్రలేఖనం, రంగులు వేయడం, సాంస్కృతిక కళలకు సంబంధించిన చెక్కభజన, యోగా, కోలాటం, డంబుల్స్, భారతీయ ఆటలు, కర్రసాముల్లో రోజూ ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకు శిక్షణనిస్తారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భూమయ్య ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్తి వివరాలకు 8099811208, 9391845885, 814322 2295 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పెండింగ్ బిల్లులు
చెల్లించండి
ట్రాన్స్‌కో సీఎండీని కలిసిన
కరెంట్ కాంట్రాక్టర్లు
సంగారెడ్డి: పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించడంతోపాటు తమ సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ట్రాన్స్‌కో సీఎండీ ముషారఫ్ అలీని విద్యుత్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ సభ్యులు కలసి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.
నేటితో ముగియనున్న ప్రజాభిప్రాయసేకరణ
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని ప్యారానగర్‌లో ఏర్పాటు చేస్తున్న డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఆందోళనలు 71వ రోజుకు చేరుకున్నాయి. డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై అధికారులు వారం రోజులుగా కొనసాగిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రి య గురువారంతో ముగియనుంది. ఈ మేరకు తహసీల్దార్ పరమేశం బుధవారం మీడియాకు వెల్ల్లడించారు. కార్యక్రమం ముగిసేలోపు ప్రజలు స్వచ్ఛందంగా తమ అభిప్రాయాలు అందించవచ్చన్నారు. సేకరించిన అభిప్రాయాలను జిల్లా ఉన్నతాధికారులకు నివేదికల రూపంలో అందించనున్నట్లు తెలిపారు.

చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి

చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి