
వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
ప్రజా సంఘాలు, దళిత నేతల డిమాండ్
సంగారెడ్డి టౌన్: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌పై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వీడియోలు సృష్టించి అవమానించిన అరుణ్‌కుమార్, నాగార్జునపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు, దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ దేశానికి రాజ్యాంగం అందించిన గొప్ప మేధావి అంబేడ్కర్ అని అటువంటి వ్యక్తిని కించపరుస్తూ పోస్టులు పెట్టడం ఆయనను తీవ్రంగా అవమానించడమేనని మండిపడ్డారు.
తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు
సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేస్తే చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్ హెచ్చరించారు. శివాజీ మహారాజ్ పాదాలకు అంబేడ్కర్ నమస్కరించినట్లుగా పోస్ట్‌చేసిన అరుణ్ కుమార్, నాగార్జున అనే వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామన్నారు.