
మూర్చ వ్యాధితో కుంట లో పడి..
శివ్వంపేట(నర్సాపూర్): ఒడ్డున ఉన్న వ్యక్తికి మూర్చ రావడంతో కుంటలో పడి నీటి మునిగి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథనం ప్రకారం... కౌడిపల్లి మండలం వెంకట్‌రావుపేట గ్రామానికి చెందిన నీలం శేఖర్(28) శనివారం కొత్తపేట గ్రామంలో ఉన్న తన బావ జగ న్ ఇంటికి వచ్చాడు. బావ, బామ్మర్ది కలిసి గ్రామ శివారులో ఉన్న రాయునికుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు. జగన్ చేపలు పట్టేందుకు కుంటలోకి దిగాడు. ఒడ్డున ఉన్న శేఖర్‌కు మూర్చ రావడంతో కుంటలో పడిపోయాడు. గుర్తించిన జగన్ కుంటలో నుంచి అతడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. మృతుడి తండ్రి వెంకట్‌స్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.