వర్గీకరణ బిల్లుకు స్వాగతం | - | Sakshi
Sakshi News home page

వర్గీకరణ బిల్లుకు స్వాగతం

Mar 16 2025 7:41 AM | Updated on Mar 16 2025 7:41 AM

వర్గీకరణ బిల్లుకు స్వాగతం

వర్గీకరణ బిల్లుకు స్వాగతం

మెదక్‌జోన్‌: అసెంబ్లీలో ప్రవేశపెట్టే ఎస్సీ వర్గీకరణ బిల్లును స్వాగతిస్తున్నామని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ మాదిగ అన్నారు. శనివారం పట్టణంలోని టీఎన్‌జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాల పాటు అనేక ఉద్యమాలు చేశామన్నారు. గతంలో నక్సలైట్లు ఎమ్మార్పీస్‌ నేతలను పోలీస్‌ ఇన్ఫార్మర్‌లు అనే నెపంతో కాల్చి చంపిన ఘటనలు సైతం ఉన్నాయని అలాంటి సమయంలో గుండె నిబ్బరంతో వర్గీకరణ పోరాటాన్ని సాగించామమని గుర్తు చేశారు. 2023లో హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో లక్షలాది మంది మాదిగలతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై వర్గీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో సైతం సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణ కోసం కృషి చేసిన తీరు అభినందనీయమన్నారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అల్లారం రత్నయ్య మాట్లాడుతూ ఈనెల 17న అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెడుతున్న క్రమంలో గ్రామ గ్రామాన మాదిగలు డప్పు చప్పుళ్లతో దండోరా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామచంద్రం, కృష్ణయ్య, స్వామీదాస్‌, సుమన్‌, ఏసు, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో

ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement