
జాతీయ స్థాయి పోటీలకు ముగ్గురు ఎంపిక
మిరుదొడ్డి(దుబ్బాక): జాతీయ స్థాయి యూనివర్సిటీ క్రీడా పోటీలకు మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన క్రీడాకారులు మద్దెల ప్రణయ్, అందె చేతన్, వేముల యువతేజ్ ఎంపికయ్యారు. 5,6 తేదీల్లో జరిగిన యూనివర్సిటీ బాల్ బాడ్మింటన్ క్రీడా పోటీల్లో మంచి ప్రతిభ కనబర్చడంతో ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ జట్లకు వీరు ఎంపికయ్యారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు నార్త్ యూనివర్సిటీలో 14 నుండి 17 వరకు జరిగే జాతీయ స్థాయి యూనివర్సిటీ బాల్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొననున్నారు. క్రీడాకారుల ఎంపికపై ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీటీసీ గొట్టం భైరయ్య, మంజీరా యూత్ సభ్యులు అందె రామచంద్రం, తోట వెంకట్‌రెడ్డి, చైన్నె భూపాల్‌గౌడ్, బోయిని శ్రీనుతోపాటు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
గ్రూప్ 1, 2లో
సత్తాచాటిన సోదరులు
బెజ్జంకి(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెలువరించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించి మండలంలోని గుగ్గిల్ల గ్రామానికి చెందిన సీత లక్ష్మి, కొమురయ్య దంపతుల కుమారులు వెంకటేశ్, హరికృష్ణ సత్తా చాటారు. గ్రూప్ 1లో పెద్ద కుమారుడు వెంకటేశ్ 466వ మార్కులు సాధించాడు. ఇతడు ప్రస్తుతం కొత్తగూడెం థర్మల్ పవర్ జెన్‌కో స్టేషన్‌లో ఏఈగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమా రుడు హరికృష్ణ సివిల్స్ ప్రిపేరవుతూ గ్రూప్ 2లో 184వ ర్యాంకు సాధించాడు. ఇద్దరు సోదరులను గ్రామస్తులు అభినందించారు.
‘రాజు పవార్’ పాంచ్ పటాకా
టేక్మాల్(మెదక్): మండలంలోని షాబాద్ తండాకు చెందిన రాజు పవార్ పోటీ పరీక్షల్లో సత్తా చాటి ఐదు ఉద్యోగాలు సాధించాడు. 2008 డీఎస్సీలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ సాధించి టేక్మాల్‌తో పాటు కల్హేర్, హవేళిఘనాపూర్, చాప్ట– కె, హనుమంతరావుపేట ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేశారు. గతేడాది జూనియర్ లెక్చరర్ కొలువు సాధించి కామారెడ్డి జిల్లా బిచ్కుందలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్– 2లో 353 మార్కులను సాధించి రాజన్న సిరిసిల్ల జోన్ ఎస్టీ విభాగంలో రెండో ర్యాంకు సాధించాడు. అలాగే గ్రూప్–1లో 456 మార్కులు సాధించి సత్తా చాటాడు. ఈసందర్భంగా రాజు పవార్‌ను మండల ప్రజలు, తోటి మిత్రులు అభినందించారు.
టోల్ బూత్‌ను ఢీకొట్టిన కారు
చిన్నశంకరంపేట(మెదక్): కారు అదుపుతప్పి టోల్ బూత్‌ను ఢీకొట్టిన ఘటన నార్సింగి జాతీయ రహదారిపై వల్లభాపూర్ వద్ద చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. గురువారం సాయంత్రం నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న టోల్ బూత్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్పగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
ట్రాక్టర్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు
దుబ్బాకటౌన్: రాయపోల్ మండల కేంద్రానికి చెందిన బైండ్ల సత్తయ్య గురువారం వ్యవసాయ పొలానికి ట్రాక్టర్ పై వెళ్తుండగా అదుపు తప్పడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకొని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

జాతీయ స్థాయి పోటీలకు ముగ్గురు ఎంపిక

జాతీయ స్థాయి పోటీలకు ముగ్గురు ఎంపిక