
ఇంటి ఎదుట ముగ్గు వేస్తుండగా..
వృద్ధురాలి మెడలోంచి గొలుసు చోరీ
తూప్రాన్: వృద్ధురాలి మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటన పట్టణ కేంద్రంలోని ఎల్లమ్మ కామాన్ వద్ద గురువారం చోటు చేసుకుంది. సీఐ రంగాకృష్ణ కథనం మేరకు.. ఎల్లమ్మ కమాన్ వద్ద నివాసం ఉంటున్న రంగమ్మ అనే వృద్ధురాలు ఇంటి ఎదుట ముగ్గు వేస్తుంది. ఓ అపరిచిత యువకుడు వృద్ధురాలితో కిరాణం దుకాణం ఎక్కడ ఉందనిని అడిగాడు. అండ్రస్ చెప్పేలోపు ఆమె మెడలోంచి ఆరు తులాల బంగారు గొలుసును తెంపుకొని పారిపోయాడు. వెంటనే ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంబడించారు. దొంగ వెంట తెచ్చుకున్న బైక్‌ను వదిలేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ రంగాకృష్ణ బాధితురాలిని విచారించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు.