
పంటల మార్పిడిపై అవగాహన తప్పనిసరి
చేగుంట(తూప్రాన్): మహిళా రైతులు పంటల మార్పిడిపై అవగాహన పెంచుకోవాలని ఐఐఆర్‌ఆర్ శాస్త్రవేత్త మహేందర్ కుమార్ అన్నారు. మండలంలోని వడియారంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సెహగల్ ఫౌండేషన్ హైటెక్ సీడ్‌ల ఆధ్వర్యంలో మహిళా రైతుల మినీ కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్ కుమార్ మాట్లాడుతూ.. మహిళా రైతులు పంటల మార్పిడి, నీటి ఎద్దడి తట్టుకునే పంటలను ఎంచుకోవడం, ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించారు. సంవత్సర కాలంలో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా రైతులకు వ్యవసాయంపై అందిస్తున్న ప్రోత్సాహం గురించి సెహగల్ ఫౌండేషన్ లీడ్ వాణి వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, ఏడీఎ రాజ్‌నారాయణ, ఏఓ హరిప్రసాద్, డాక్టర్ రవికుమార్, మొహినొద్దీన్, విభ, గాయత్రీ, బిందు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు విజయ్, శ్రవణ్, మహిళా రైతులు పాల్గొన్నారు.