
విద్యారంగానికి నిధులు కేటాయించాలి
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌లో విద్యాశాఖకు 15 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఏఓ రెహమన్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య మాట్లాడుతూ.. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని, అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ నేడు విద్యారంగంపై సవతితల్లి ప్రేమను చూపిస్తుందన్నారు. గత సంవత్సరం బడ్జెట్‌లో కేవలం 7 శాతం నిధులే కేటాయించి, వాటిని కూడా విడుదల చేయలేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయించి, బకాయిలను అందించాలన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీపతి, నగర ఉపాధ్యక్షుడు రాకేశ్, సర్ధార్ వల్లాబాయి పటేల్ జోన్ ఇన్‌చార్జి సాయిశంకర్, శ్రావణ్, తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏఓకు వినతి