
కూలీలకు ఉపాధి కల్పించాలి
కంగ్టి/కల్హేర్ (నారాయణఖేడ్): కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పించాలని, ఆ పనులకు కూలీలు గరిష్ట వేతనం పొందేటట్లు అధికారులు చొరవ చూపాలని జిల్లా అదనపు డీఆర్డీవో బాలరాజు సూచించారు. కంగ్టిలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఉపాధిపనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. చాప్టా(కే), కంగ్టి గ్రామాల శివారులో కూలీలకు పనులపై అవగాహన కల్పించారు. ఉపాధి హాజరు పరిశీలించేందుకు మస్టర్ రోల్ ప్రకారం కూలీలకు హాజరు తీసుకున్నారు. చాప్టా(కే)లో 80మంది, కంగ్టిలో 220 మంది కూలీలు పనులు చేశారు. అదేవిధంగా కల్హేర్‌లో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామి సిబ్బందితో బాలరాజు సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న పనుల గురించి చర్చించారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ...అన్ని పంచాయతీల్లో పనులు ప్రారంభించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విజిలెన్స్ అధికారి నాగేశ్వర్‌రావు, ప్లాంటేషన్ మేనేజర్ మణికుమార్, ఎంపీటీఓ సత్తయ్య, ఏపీఓ నర్సింలు, టీఏలు ఉపాధి సిబ్బంది, కూలీలు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
అదనపు డీఆర్డీవో బాలరాజు