జోగిపేట(అందోల్): పదవ తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమవుతుంది. 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేవలం పది రోజులు మాత్రమే ఉండటంతో విద్యార్థులు ఒత్తిడి గురికానున్నారు. పరీక్షల్లో విజయవంతం సాధించాలంటే ఆందోళనకు గురి కాకుండా ఒత్తిని జయించాలి. ఈ పది రోజుల్లో ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలి? సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి? ఎలా అధ్యయనం చేయాలి? అనే అంశాలపై పదవ తరగతి సబ్జెక్టులు బోధించే జోగిపేటలోని జెడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థులకు వారు పలు సూచనలు చేశారు.
సబ్జెక్ట్ టీచర్ల చిట్కాలు
● ఒత్తిడిని జయించి..ప్రణాళిక ప్రకారం చదవాలి
● ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకొని రాయాలి
● పాఠ్యాంశాల్లోని కీలక భావాలపై దృష్టి సారించండి
● రివిజన్ చాలా ముఖ్యం