
100 మార్కులు సాధించవచ్చు
ప్రతీ అధ్యాయంలో చివర ఇచ్చిన ముఖ్య అంశాల్లోని సూత్రాలను, నిర్వచనాలను అధ్యయనం చేయాలి. సమస్యల సాధన, కారణాలను తెలపడం నిరూపించడం లాంటి నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాలి. నిరూపక రేఖ గణితం, రేఖా గణితం, సంభావ్యత, సంఖ్యాశాస్త్రం, బీజీయా సమాసాలపై సాధన చేయాలి. గ్రాఫ్ ఆధారిత సమస్యలపై సాధన అవసరం. నిర్మాణాత్మక సమస్య సాధనపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఓజీవ్ గ్రాఫ్, త్రికోణమితిలో పటాలను గీయడాన్ని ప్రాక్టీస్ చేయాలి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే పాఠ్యాంశాల్లోని కీలక భావనలపై దృష్టిని సారించాలి.
– త్రినాథరావు, గణితశాస్త్రం