యుద్ధ ప్రాతిపదికన పనులు | - | Sakshi
Sakshi News home page

యుద్ధ ప్రాతిపదికన పనులు

Jun 16 2024 10:44 AM | Updated on Jun 16 2024 10:44 AM

యుద్ధ

యుద్ధ ప్రాతిపదికన పనులు

దుబ్బాక: ‘బాబోయ్‌..హైటెన్షన్‌’ పేరిట సాక్షిలో శుక్రవారం వెలువడిన కథనం విద్యుత్‌ ఉన్నతాధికారులను కదిలించింది. దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో ఏడాదికిపైగా గాలివానకు సిద్దిపేట నుంచి దుబ్బాక, దోమకొండ ప్రాంతాల్లోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లకు సరఫరాచేసే మెయిన్‌ లైన్‌లో డీపీ స్తంభాలు విరిగి ఎప్పుడు, ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో రైతులు బిక్కు బిక్కుమంటు గడుపుతూవచ్చారు. ప్రమాదకరంగా మారిన మెయిన్‌లైన్‌తో రైతులు పడుతున్న పరిస్థితిని శుక్రవారం సాక్షి వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన సిద్దిపేట ఎస్‌ఈ మోహన్‌రెడ్డి వెంటనే ప్రమాదకరంగా ఉన్న మెయిన్‌లైన్‌ డీపీ స్తంభాలను తొలగించి కొత్తవాటిని వేయాలని ఆదేశించారు. వెంటనే దుబ్బాక ఏడీ రాంబాబు, రూరల్‌ ఏఈ జయకృష్ణ, కాంట్రాక్టర్‌ గుర్రం వెంకట్‌రెడ్డి దగ్గరుండి పనులు పూర్తిచేయించారు. ఏడాదిగా ఉన్న ప్రధాన విద్యుత్‌ సమస్య కేవలం రెండు రోజుల్లోనే పరిష్కరించడం విశేషం.

అప్పనపల్లి గ్రామస్తుల కృతజ్ఞతలు

ఏడాదికి పైగా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌లైన్‌తో ప్రతిరోజు ప్రాణభయంతో గడిపామని, ఇంతటి సమస్యను సాక్షి వెలుగులోకి తేవడంతో విద్యుత్‌ ఉన్నతాధికారులు స్పందించి రెండు రోజుల్లోనే పరిష్కరించడంపై అప్పనపల్లి గ్రామస్తులు, రైతులు ఆనందం వ్యక్తం చేశారు. తమ కష్టాలను వెలుగులోకి తెచ్చి పరిష్కరించేందుకు కృషిచేసిన సాక్షికి, అలాగే విద్యుత్‌ ఎస్‌ఈ మోహన్‌రెడ్డి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

స్పందించిన విద్యుత్‌ అధికారులు

కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు

యుద్ధ ప్రాతిపదికన పనులు1
1/1

యుద్ధ ప్రాతిపదికన పనులు

Advertisement
 
Advertisement
Advertisement