
సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్న తన్వీర్
జహీరాబాద్: జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నేతలు పెద్ద సంఖ్యలో హస్తం గూటికి చేరారు. మంగళవారం హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఫరీదుద్దీన్ తనయుడు, టీఎస్‌ఐడీసీ మాజీ చైర్మన్ ఎండీ తన్వీర్‌తో పాటు మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుభాష్, మాజీ జెడ్పీటీసీ కిషన్‌రావు పవార్, మాజీ కౌన్సిలర్లు యూనూస్, జహంగీర్, అరుణ్‌కుమార్, రాములునేత, మోతిరాం, మహిపాల్‌రెడ్డి, పుణ్యమ్మ, మొగుడంపల్లి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీలు కుత్‌బుద్దీన్, హన్నాన్ జావీద్‌లతో పాటు శ్రీకాంత్‌రెడ్డి, సుల్తాన్, బి.జి.సందీప్, బాబీ, నవీద్, సమి, గోవర్ధన్‌రెడ్డిలకు సీఎం కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కార్, ఎస్.ఉజ్వల్‌రెడ్డి, ఏ.చంద్రశేఖర్, ఎన్.గిరిధర్‌రెడ్డిలు పాల్గొన్నారు.