
సమావేశంలో మాట్లాడుతున్న మహాదేవస్వామి
రామచంద్రాపురం(పటాన్‌చెరు) : బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని మెదక్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. మంగళవారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తెల్లాపూర్ నైబర్‌హుడ్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం నైబర్‌హూడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వర్‌గారి రమణ మాట్లాడుతూ తెల్లాపూర్ వరకు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే తెల్లాపూర్ నుంచి విద్యుత్‌నగర్ కాలనీకి వెళ్లే మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జ్‌ను వెడల్పు చేయాలని కోరారు. తెల్లాపూర్ రైల్వే స్టేషన్‌కు రేడియల్ రోడ్డు 7ను అనుసంధానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో రాంకుమార్, శరత్, రవికుమార్, లోక్‌నాఽథ్ పాల్గొన్నారు.
ఆస్పత్రి తనిఖీ
న్యాల్‌కల్(జహీరాబాద్): రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్య సూపరింటెండెంట్ సంగారెడ్డి సూచించారు. మంగళవారం మండల పరిధిలోని మిర్జాపూర్(బి) ప్రభుత్వాస్పత్రిని ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఎండల అధికంగా ఉన్నందున ప్రజలకు వడదెబ్బపై అవగాహన కల్పించాలన్నారు.
ఉద్యోగుల సంఖ్య పెంచండి
సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని ఎంఆర్‌ఎఫ్ యూనియన్ నాయకులు మంగళవారం ఈఎస్‌ఐ డిస్పెన్సరీ మెడికల్ అధికారి జామ్యాకు వినతి పత్రం అందజేశారు. వైద్య సిబ్బంది తక్కువగా ఉన్నందువల్ల కార్మికులకు సేవలు సరిగా అందడం లేదని చెప్పారు.
ప్రజల్లో చైతన్యం
తెచ్చేందుకే పోటీ
జహీరాబాద్: తాను ప్రజల్లో ఉండి సేవలందించడంతో పాటు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకే స్వతంత్ర అభ్యర్థిగా జహీరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు మహాదేవ మఠం పీఠాధిపతి మహాదేవ స్వామి తెలిపారు. మంగళవారం జహీరాబాద్‌కు వచ్చిన ఆయన మాట్లాడారు. నాయకులు ఆస్తుల సంపాదనకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శించారు. కొన్నేళ్లుగా సామాజిక సేవలు చేస్తూ వస్తున్నానని, ఎల్లారెడ్డి నియోజవర్గంలోని గాంధారి మండలం, గుడిమేట గ్రామంలో ఉన్న మహాదేవ మఠం ద్వారా ఉచితంగా విద్యాబోధన అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సమావేశంలో శివకుమార్‌స్వామి, నాగయ్యస్వామి, మాధవరావుపాటిల్, అనిరుధ్‌స్వామి పాల్గొన్నారు.
ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడిగా సురేష్‌పూరి
జహీరాబాద్: పట్టణానికి చెందిన సురేష్‌పూరి బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తన నియామకానికి సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలని తెలిపారు. తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పార్టీ పటిష్టానికి కృషి చేస్తానన్నారు.

వినతి పత్రం అందిస్తున్న నాయకులు