ఆరోగ్యశ్రీతో కార్పొరేట్‌ వైద్యం

మహిళలతో కలిసి  విజయ చిహ్నం చూపుతున్న రాజనర్సింహ - Sakshi

జోగిపేట (అందోల్‌) : ఆరోగ్యశ్రీతో పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట ఆర్టీసీ బస్‌ స్టాండ్‌ ఆవరణలో ఆదివారం మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలను కలెక్టర్‌ శరత్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం ప్రజలందరికీ వైద్యం అందించాలన్న లక్ష్యంతో ఆరోగ్యశ్రీ రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు విస్తరింపజేసిందన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ కార్పొరేట్‌ వైద్యం అన్ని ఆసుపత్రుల్లో వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వట్‌పల్లి మండల కేంద్రంలో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మిస్తామని ప్రకటించారు. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ప్రయాణించడానికి మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండు రోజులకే రెండు గ్యారంటీలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గాయత్రీదేవి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ సంగారెడ్డి, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, రిజినల్‌ మేనేజర్‌ ప్రభులత, సంగారెడ్డి డిపో మేనేజర్‌ ఉపేందర్‌, మెప్మా పీడీ గీత, రాష్ట్ర యువ నాయకురాలు త్రిష, పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ఆకుల మాణయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లయ్య, అందోల్‌, వట్‌పల్లి జెడ్పీటీసీలు రమేశ్‌, పత్రి అపర్ణ, వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రవీణ్‌, కౌన్సిలర్లు ఆకుల చిట్టిబాబు, సురేందర్‌గౌడ్‌, రేఖ ప్రవీణ్‌, రంగ సురేశ్‌, డాకూరి శివశంకర్‌, హరికృష్ణ, నాగరాజు, చందర్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ పద్మనాభరెడ్డి, మాజీ ఎంపీటీసీలు వెంకటేశం, రమేశ్‌గౌడ్‌, బాలయ్య, నాయకులు సంగమేశ్వర్‌గౌడ్‌, డాకూరి శ్రీనివాస్‌, ప్రదీప్‌ గౌడ్‌, రవి పాల్గొన్నారు.

వైద్యారోగ్య శాఖ మంత్రి

దామోదర రాజనర్సింహ

Read latest Sangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top