మెదక్ రీజియన్ మేనేజర్ ప్రభులత
సంగారెడ్డి టౌన్: ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆర్టీసీ మెదక్ రీజియన్ మేనేజర్ ప్రభులత అన్నారు. మంగళవారం డయల్ యువర్ ఆర్‌ఎం కార్యక్రమం నిర్వహించారు. నారాయణఖేడ్ నుంచి బషీర్ మాట్లాడుతూ నారాయణఖేడ్ కార్గో పార్సిల్ బుక్ చేస్తే ఆలస్యంగా వస్తోందని త్వరగా వచ్చేలా చూడాలన్నారు. కంది నుంచి జైపాల్ మాట్లాడుతూ చర్యలు జల్కల్ స్కూల్ బస్సును రెగ్యులర్ గా నడపాలన్నారు. సంగారెడ్డి నుంచి నరేష్ మాట్లాడుతూ శబరిమలైకి ప్రత్యేక బస్సులు నడపాలని కోరారు. గడిపెద్దాపూర్ నుంచి ప్రభాకర్ మాట్లాడుతూ మెదక్ నుంచి పెద్దశంకరంపేట, గడిపెద్దాపూర్ మీదుగా సర్వీస్ నడపాలి విజ్ఞప్తి చేశారు. మల్లికార్జున్ పల్లి నుంచి మనోహర్ మాట్లాడుతూ సదాశివపేట నుంచి మల్లికార్జునపల్లి వయా మునిపల్లి మీదుగా బస్సులు నడపాలన్నారు. సిర్గాపూర్ నుంచి అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ నారాయణఖేడ్ నుంచి పిట్లం వరకు బస్సులు నడపాలి కోరారు. ప్రజల సమస్యలను విన్న ఆర్‌యం త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.