
హత్నూరలో ప్రతిజ్ఞ చేస్తున్న ఓటర్లు
హత్నూర( సంగారెడ్డి): ప్రజలు ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని స్వీప్ నియోజకవర్గ నోడల్ అధికారులు బ్రహ్మాజీ, హేమభార్గవి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన హత్నూరలోని ఐటీఐ కాలనీతోపాటు ఐకేపీ కార్యాలయంలో ఓటుహక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన జరిగే శాసనసభ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. హత్నూర, దౌల్తాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించి ఓటర్లకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ శోభారాణి, ఐకేపీ సిబ్బంది, అంగన్‌వాడీ, టీచర్లు, ఆయాలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.