పటాన్‌చెరు: అమెరికా(ఫ్లోరిడా)లోని గ్రేటర్ మయామిలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు సమర్పించిన పరిశోధనా పత్రాలను సమీక్షించడానికి గీతం అధ్యాపకుడికి అవకాశం లభించింది. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హేమరాజు సమీక్షకుడిగా ఎంపికయ్యారు. ప్రపంచంలో ఉన్న నిపుణులకు ఒకచోటకు చేర్చే లక్ష్యంతో అమెరికా (ఫ్లోరిడా)లోని గ్రేటర్ మయామిలో 2024 ఏప్రిల్ 15 నుంచి 18 తేదీల్లో నిర్వహిస్తున్నారు. శాస్త్ర, సాంకేతిక, నిర్మాణం, భూమి, చంద్రుడు, అంగారక గ్రహం వెలుపల వాతావరణాలపై నిపుణులు ఈ సదస్సులో సమీక్షించనున్నారు.