ఆమనగల్లు: మత్తు పదార్థాలకు అందరూ దూరంగా ఉండాలని ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ కోరారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు మత్తుపదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయని హెచ్చరించారు. విద్యార్థులు కొత్తగా వచ్చే స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలని, వారు మంచివారా చెడ్డవారా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తుండాలని సూచించారు. ఎక్కడైనా మత్తుపదార్థాలు విక్రయించినా, మత్తు పదార్థాలతో పార్టీలు జరిగినా వెంటనే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. అనుమతి లేకుండా మద్యం పార్టీలు చేసినా, డ్రగ్స్ తీసుకున్నా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్‌ఐలు అరుణ్ కుమార్, స్వప్న, సిబ్బంది చిన్నాగౌడ్, శ్రీను, శివప్రసాద్, లింగం, సాయి శ్రీజ తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్


