మీర్‌పేట: డీజిల్ పోసుకుని బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన మీర్ పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సారంగపాణి కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌కు చెందిన మాలగరి గీత భర్త చనిపోవడంతో కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం బడంగ్‌పేట శ్రీమారుతీనగర్ కాలనీకి వచ్చి స్థానికంగా కూరగాయలు విక్రయిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె కీర్తి (21) గండిపేటలోని ఎంజీఐటీ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. రోజు మాదిరిగా శనివారం కళాశాలకు వెళ్లి మధ్యా హ్నం ఇంటికి వచ్చింది. కుటుంబ సభ్యులు సమీపంలోని జయశంకర్‌కాలనీలో నివాసముండే బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న కీర్తి 4.30 గంటల సమయంలో డీజిల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసు కుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు ద ర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సోదరుడు క్యాబ్ డ్రైవర్ కావడంతో ఇంట్లో డీజిల్‌ను నిల్వ చేసినట్లు తెలుస్తోంది.
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీలో ఎల్‌ఆర్‌ఎస్–2020 దరఖాస్తుల్ని త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవి పని చేస్తాయి. దరఖాస్తుల స్థితి, అనుమతులకు సంబంధించి గైడెన్స్, షార్ట్‌ఫాల్స్, చెల్లింపులకు సంబంధించి వివరాలు అందిస్తారు. ఎల్‌ఆర్‌ఎస్ పోర్టల్ వినియోగంపై సహకారం, అవసరమైన వారికి ప్రత్యక్ష హెల్ప్‌లైన్ సేవలు ఉంటాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని పౌరులు 25 శాతం రాయితీతో ఎల్‌ఆర్‌ఎస్ చార్జీలు చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.


