రైతులను ఇబ్బంది పెట్టొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

May 3 2026 10:16 AM | Updated on May 3 2026 10:16 AM

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

అదనపు కలెక్టర్‌ వెంకటాచారి

పరిగి: పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ వెంకటాచారి సూచించారు. శనివారం ఆయన పరిగి తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూ సమస్యలపై వచ్చిన రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని సూచించారు. రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మండలంలో భూ సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమయపాలన పాటిస్తూ రెవెన్యూ అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. సాదాబైనామాల దరఖాస్తులను వెంటనే పూర్తి చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement