బడంగ్‌పేట్: బాలాపూర్‌కు చెందిన పీపీరెడ్డి గ్రూప్ ఆఫ్ చైర్మన్, యాదాద్రి రెడ్డి సంఘం అధ్యక్షుడు పన్నాల పర్వతాల్‌రెడ్డి రెడ్డి భవన్ నిర్మాణానికి రూ.కోటి విరాళాన్ని ప్రకటించి అందజేశారు. తిరుపతిలో నిర్మించే ఆంధ్రప్రదేశ్ ఇంటర్నేషనల్ రెడ్డి భవన్ నిర్మాణానికి భారీ విరాళం అందజేయడంపై రెడ్డి సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీపీరెడ్డిని శనివారం అభినందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మురళీకృష్ణారెడ్డి, మల్‌రెడ్డి రాంరెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డి, నరోత్తంరెడ్డి, కొలన్ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


